హైదరాబాద్ : ఉపాధి కోసం లండన్‌లో నివసిస్తున్న హైదరాబాద్ వాసిని ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ... హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ ఖాజా రయిసుద్దీన్ (65) లండన్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో 2011 నుంచి నివాసముంటున్నారు. భారత కాలమానం ప్రకారం ... గత శనివారం రాత్రి ఖాజా తన స్నేహితుడైన ఆఫ్ఘాన్ దేశస్థుడి (53)తో కలిసి వెళుతుండగా ఇద్దరు దుండగులు వారిద్దరినీ విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటనలో రయిసుద్దీన్, అతడి స్నేహితుడు మఅతి చెందారు. ఈ నెల 5వ తేదీన రయిసుద్దీన్ కుమార్తె పెళ్లి ఉండటంతో అందరూ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఈలోగా ఈ ఘటన చోటు చేసుకుందని కుటుంబీకులు వాపోయారు. మఅతుడి కుటుంబీకులను ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి సాయం అందించాలని.. వెంటనే మఅతుని నివాసం వద్దకు లండన్‌లో ఉన్న ఇండియన్ హై కమిషన్ ప్రతినిధులు చేరుకుని తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్‌కు మెయిల్ చేశారు.










