ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ పట్టణంలో చిరువ్యాపారులపై మున్సిపల్ అధికారులు మరోసారి కొరడా జూళిపించారు. వైఎస్సార్ ఫ్రూట్ మార్కెట్ కు చిరువ్యాపారులు తరళిపోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గాంధీసెంటర్ ,మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్, శివాలయం, రధం సెంటర్ ,చందర్లపాడు బస్టాండ్ తదితర ఏరియాలో వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బండ్లలను మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది బలవంతంగా మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. కూరగాయలు , అరటి కాయలు ,మామిడి కాయలు తదితర పచ్చి సరుకులు ద్వంసం చేశారని మున్సిపల్ సిబ్బంది పై చిరువ్యాపారులు ఫిర్యాదు చేశారు. తమకు అవకాశం ఇవ్వాలని, తాము కోర్టుకు వెళ్ళతామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఎన్‌ఎస్పి క్వార్టర్స్ లోపల వ్యాపారం సాగదని రోడ్డు వైపు షాపులు అందరికీ. కేటాయించాలని కోరారు.










