Sep 19,2023 08:47

కేవీబీపురం (తిరుపతి) : కలుషిత ప్రసాదం తిని 50మందికిపైగా అస్వస్థతకు గురైన ఘటన తిరుపతి జిల్లా కేవీబి పురంలో జరిగింది. తిరుపతి జిల్లా కేవీబిపురం మండలం ఆరె గ్రామంలో కలుషిత ప్రసాదం తిని 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గ్రామంలోని ఆలయ ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న తర్వాత గ్రామస్థులు అతిసారానికి గురయ్యారు. దీంతో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కేవీబీపురం ఆస్పత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు.