ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి :ప్రముఖ కవయిత్రి మొల్ల (ఆతుకూరి మొల్లమాంబ) జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతియేటా మార్చి 13న ఆమె జయంతిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించెందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాన్ని తగిన విధంగా నిర్వహించెందుకు అన్ని శాఖలూ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఉత్సవానికి అయ్యే వ్యయాన్ని ఆయా శాఖలు తమకు కేటాయించిన బడ్జెట్ నిధుల నుంచే భరించాలని సూచించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.










