రంగారెడ్డి (తెలంగాణ) : ముఖ్యమంత్రి అల్పాహార పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ స్కూల్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. సబితా, హరీశ్ రావు కూడా వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరోవైపు... సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కెటిఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కలిసి టిఫిన్ చేసిన మంత్రి.. రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.










