ప్రజాశక్తి-వన్ టౌన్ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు క్యూ లైన్ లో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈరోజు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ,మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ,జనసేన అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
- దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, అందరికీ ఆహారం సమఅద్ధిగా అందాలని, పాడిపంటలతో పురోభివఅద్ధి ప్రసాదించాలని జగన్మాతను వేడుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ... మంగళవారం ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయ పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో దర్శనం అనంతరం ఆశీర్వచనం అందించారు. అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం మీడియా పాయింట్ నుండి మంత్రి మాట్లాడుతూ ... రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ ఆహారాన్ని అందించే శాఖకు మంత్రిగా నియమించడం అమ్మవారి కృప వల్లనే అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరాఘాటంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేందుకు ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను వేడుకున్నానని మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు.










