Oct 06,2023 16:06

కరీంనగర్‌ : ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి తన ప్రేమ గుణాన్ని చాటుకున్నారు. కరీంనగర్‌లో తన వ్యక్తిగత కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి అనంతుల రమేష్‌ గాయపడగా బిజీ షెడ్యూల్లో సైతం తన ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు కనుక్కున్నారు మంత్రి గంగుల కమలాకర్‌. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా పీఆర్వో రమేష్‌ మాట్లాడుతూ.. మంత్రికి ప్రజలపై ఉండే ప్రేమను ఆయన వెనకాల ఉండి ప్రతిరోజు చూస్తానని, ఈరోజు స్వయంగా అనుభూతి చెందానన్నారు. గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ఆయన ఓదార్పు ఎంతో స్వాంతన ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో కుటుంబ సభ్యులతో పాటు నగర మేయర్‌ సునీల్‌ రావు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.