ముంబయి : మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టి20 ప్రపంచకప్ టైటిల్ విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ నియమింపబడింది. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇక వైస్ కెప్టెన్‌గా జెమామీ రోడ్రిగ్స్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ జట్టు డబ్ల్యుపిఎల్‌లో తొలి లీగ్ మ్యాన్‌ను 5న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ సందర్భంగా 30ఏళ్ల లానింగ్ మాట్లాడుతూ.. ఆరంభ డబ్ల్యుపిఎల్ ఢిల్లీ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. లానింగ్ కెరీర్‌లో 132 టి20 మ్యాచ్‌ల్లో 36.61 యావరేజ్‌తో 3,405పరుగులు చేసింది. స్ట్రయిక్‌రేట్ 116.37. ఆస్ట్రేలియా జట్టు తరఫున 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఐదు జట్ల మధ్య జరిగే డబ్ల్యుపిఎల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు ప్లేయర్స్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. వీరిలో బెత్ మూనీ, అలెసా హీలీ వ్యవహరిస్తున్నారు.
- డబ్ల్యుపిఎల్ ఫ్రాంచైజీ కెప్టెన్లు..
ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్(ఆస్ట్రేలియా)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన
యుపి వారియర్స్ : అలైస్సా హీలీ(ఆస్ట్రేలియా)
ముంబయి ఇండియన్స్ : హర్మన్‌ప్రీత్ కౌర్
గుజరాత్ జెయింట్స్ : బెత్ మూనీ(ఆస్ట్రేలియా)










