హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాజాగా మేడిపల్లి లో బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరుచు గంజాయి సేవించే అలవాటున్న వారు బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడి పెళ్లికి చెందిన ఓ మైనర్ బాలికలను ఇద్దరు వ్యక్తులు మాయ మాటలు చెప్పి స్థానికంగా ఉన్న పాఠశాలకు తీసుకువెళ్లి లైంగికదాదాడి చేశారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారు తమ ప్రాంతానికి చెందిన వారేనని బాధితురాలు తల్లిదండ్రులు వెల్లడించారు. అంతేకాదు వారు తరుచు గంజాయి సేవిస్తుండే వారని పోలీసులకు తెలిపారు. పోలీసుల రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.










