హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్ దీపక్‌రావును అరెస్టు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. అరెస్టు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ''పలువురు మావోయిస్టు అగ్రనేతలతో దీపక్‌రావు సమావేశాలు జరిపారు. పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ టైజంక్షన్ ఏరియాలో కీలకంగా వ్యవహరించారు. ఈఏడాది అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న దీపక్‌రావు రెండు..మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. కచ్చితమైన సమాచారంతో అరెస్టు చేశాం. అతని కోసం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక పోలీసులు, ఎన్‌ఐఏ బఅందాలు గాలిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీపక్‌పై రూ.25లక్షల రివార్డు ప్రకటించింది'' అని డీజీపీ వెల్లడించారు.