Sep 23,2023 11:51

హైదరాబాద్‌ : మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి సినీ నటుడు నవదీప్‌ నార్కోటిక్స్‌ పోలీసుల విచారణకు నేడు హాజరయ్యారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను నిందితుడిగా, డ్రగ్స్‌ వినియోగదారుడిగా పేర్కొన్న పోలీసులు.. నవదీప్‌ ఎవరెవరి నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ విక్రేత రామచందర్‌తో ఉన్న లింకులపై నవదీప్‌ను ఆరా తీస్తున్నారు. శనివారం తమ ముందు హాజరుకావాలని నవదీప్‌కు ముందుగానే నార్కోటిక్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో.. ఈరోజు నవదీప్‌ నార్కోటిక్స్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు.