Oct 01,2023 15:03

హైదరాబాద్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి తెలిపారు.ఆదివారం ఉదయమే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో కసిరెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ఛైర్మన్‌ బాలాజీ సింగ్‌ కూడా బిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.