Jul 31,2023 12:52

కుత్బుల్లాపూర్‌ (హైదరాబాద్‌) : గుండెపోటుతో ఎంబిఎ విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది.

పోలీసుల కథనం మేరకు ... పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని మైసమ్మగూడలోని హాస్టల్‌లో నివాసముంటున్న కుశాల్‌ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో కుశాల్‌ బాధపడుతున్నాడు. నిన్న రాత్రి బాత్‌రూంలో కుప్పకూలాడు. మూత్ర విసర్జన సమయంలో గుండె నొప్పి రావడంతో కుశాల్‌ మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ అస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.