Sep 25,2023 11:52

న్యూఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్‌ చేశారు. లూథ్రా వాదనలు విన్న సుప్రీం సీజేఐ రేపు మెన్షన్‌ లిస్టుతో రావాలని అనుమతినిచ్చారు. లూథ్రా తన వాదనలు వినిపిస్తూ .... ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యవహారమని.. అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వద్ద ప్రస్తావించారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడగగా.. ఈనెల 8న చంద్రబాబును అరెస్ట్‌ చేశారని న్యాయవాది తెలిపారు. సీజేఐ మాట్లాడుతూ ... రేపు (మంగళవారం) మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సిద్ధార్థ లూథ్రాకు సూచించారు. ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.