లక్నో: హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో ఐపిఎల్-2023లో బోణీ కొట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉవ్విళ్లూరుతుంది. లక్నోతో జరగబోయే ఈ పోరులో ఎస్‌ఆర్‌హెచ్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. కాగా ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక లక్నోతో మ్యాచ్‌కు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ అందుబాటులో ఉండనున్నాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్ కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మార్‌క్రమ్.. లక్నోతో మ్యాచ్‌లో మాత్రం తమ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మార్‌క్రమ్ జట్టుతో కలవడం సన్‌రైజర్స్ పటిష్టంగా కన్పిస్తోంది. అయితే మార్‌క్రమ్ అందుబాటులోకి రావడంతో లక్నోతో మ్యాచ్‌కు హ్యారీ బ్రూక్‌ను ప్రక్కన పెట్టే అవకాశముంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ పేసర్లు తమ మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో ఒక నటరాజన్ మినహా మిగితా అందరూ నిరాశపరిచారు. కానీ జట్టులో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హక్ ఫారూఖీ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు. వీరు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేస్తే.. లక్నో బ్యాటర్లకు చుక్కలు కన్పించడం ఖాయం.
ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్, ఫజల్హక్ ఫారూఖీ
లక్నో సూపర్ జెయింట్స్ : కైల్ మేయర్స్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ రవిసింగ్ ఠాకూర్










