Jul 24,2023 13:10

వజ్రకరూరు (అనంతపురం) : సాగులో నష్టాలు రావడంతో, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ... తండ్రీకొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సోమవారం వజ్రకరూరు మండలం లోని గంజికుంట బస్‌ స్టాప్‌ వద్ద జరిగింది. తండ్రీకొడుకు గత మూడేళ్లుగా చేస్తున్న సాగులో నష్టాలు రావడంతో పప్పుశనగ వ్యాపార రైతులుగా మారారు. సాగులో నష్టాలు రావడంతోపాటు, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఇద్దరు రైతులు గంజికుంట బస్టాప్‌ వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతి చెందినవారు బెళ్లుగుప్ప గ్రామానికి చెందిన ర్తెతులు రామూర్తి , సాయి కుమారులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.