Oct 14,2023 09:24

అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. శనివారం గన్నవరం నుంచి రోడ్డు మార్గాన నేరుగా రాజమండ్రికి వెళ్లనున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు ప్రయత్నిస్తున్నారు. ములాఖత్‌ కోసం జైలు అధికారులను సంప్రదిస్తున్నారు.