ప్రజాశక్తి - విజయవాడ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయిన నేపథ్యంలో న్యాయనిపుణులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన కుమారుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం రాత్రి గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు న్యాయవాదులతో జరిగిన చర్చలపై చంద్రబాబుకు వివరించనున్నట్టు సమాచారం.










