బోడుప్పల్: ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సీమాంధ్ర నాయకుల ఒత్తిళ్లకు తలగ్గక అమరవీరుల త్యాగాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారని అని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓ బి సి డిక్లరేషన్ కమిటీ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో టిపిసిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయభేరి సభ సన్నాహక సమావేశం బుధవారం బోడుప్పల్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ యువత తొమ్మిదేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో మోసానికే గురయ్యారే తప్పా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించే విజయభేరి సభకై తెలంగాణకు విచ్చేయుచున్న శ్రీమతి సోనియాగాంధీ , ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ, నాయకురాలు ప్రియాంక గాంధీలకు తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటే విధంగా సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో ంది. ఈ సమావేశానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎర్ర శేఖర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కరదర్శి పొన్నం తరుణ్ గౌడ్,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, మురళి నాయక్,హరి కఅష్ణ గౌడ్,సూరి,తదితరులు పాల్గొన్నారు










