Sep 25,2023 15:36

హైదరాబాద్‌ : గణేష్‌ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌తో పాటు నగరంలో ఉన్నటువంటి చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలను కృత్రిమ నీటి కుంటలో నిమజ్జనం చేయాలని సూచించింది. వెంటనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నగర సీపీ ఆనంద్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ నగరంలో దాదాపు లక్ష మండపాటు ఏర్పాటు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.