May 20,2023 21:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌:అండర్‌ 19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో విజయనగరంలోని రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే 66 వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు విజయనగరం బాల, బాలికలు జట్లు బోణీ కొట్టాయి. బాలికల జట్టు లీగ్‌ దశలో గ్రూప్‌ా డి లో తూర్పు గోదావరి జట్టు పై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. విజయనగరం బాలురు జట్టు సిా పూల్‌ విభాగంలో అనంతపురం జట్టు పై విజయం సాధించింది. చిత్తూరు, కృష్ణా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కృష్జా జిల్లా జట్టు విజయం సాధించింది. గుంటూరు, పశ్చిమ గోదావరి జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో గుంటూరు, నెల్లూరు, కడప జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో నెల్లూరు విజయం సాధించాయి. విశాఖ, అనంతపురం జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో విశాఖ, చిత్తూరు, గుంటూరు మ్యాచ్‌లో గుంటూరు విజయం సాధించాయి.
బాలికల విభాగంలో అనంతపురాం నెల్లూరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు, విశాఖా చిత్తూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు, పశ్చిమ గోదావరిా గుంటూరు మ్యాచ్‌లో గుంటూరు జట్టు, విజయనగరాం తూర్పు గోదావరి జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌ లో విజయనగరం, అనంతపురాంకృష్ణా జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌ లో కృష్ణా జట్టు, విశాఖాశ్రీకాకుళం జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీకాకుళం జట్టు విజయం సాధించాయి. ఆదివారం క్వార్టర్‌ ఫైనల్‌, సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.