Jul 02,2023 21:13

లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ రెండో టెస్టులో ఆసీస్‌ గెలుపోందింది. కాగా ఈ మ్యాచ్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో రనౌట్‌పై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 52 ఓవర్‌ వేసిన కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో ఆఖరి బంతిని బెయిర్‌ స్టో వెనుక్కి విడిచిపెట్టాడు. ఈ క్రమంలో బంతి కీపర్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్‌ ముగిసిందని భావించిన జానీ బెయిర్‌స్టో.. క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ బంతిని స్టంప్స్‌కు త్రో చేసి రనౌట్‌కి అప్పీల్‌ చేశాడు. అయితే బెయిర్‌స్టో కనీసం కీపర్‌కి కానీ, అంపైర్‌కీ కానీ సిగల్‌ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్‌ అంపైర్‌ రనౌట్‌గా ప్రకటించాడు. ఇక బెయిర్‌స్టో రనౌట్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌, జానీ బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధమని.. ఆస్ట్రేలియా రనౌట్‌ అప్పీల్‌ను ఉపసంహరించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. కొంత మంది ఆసీస్‌కు ఇది అలవాటే అని, ఛీటర్స్‌ అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఛీటర్స్‌ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది.