తిరుపతి: టిడిపి-జనసేన పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారన్నారు. పవన్‌ను ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతామని హెచ్చరిచారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలో పవన్ ప్రకటిస్తారని చెప్పారు. బిజెపితో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. రూ.కోట్ల ఆస్తులున్న పెద్ద నేతలు జనసేనకు అక్కర్లేదన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వబోమని.. ప్రజా సేవకులకే సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు.










