Feb 22,2023 15:13

దుబాయ్ : 40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే బౌలింగ్‌ పర్ఫామెన్స్‌తో ఇంగ్లాండ్‌ వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా ఎంపికయ్యాడు. 866 రేటింగ్‌ పాయింట్లతో మొదటి ర్యాంకు అందుకున్నాడు.  బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. జేమ్స్‌ అండర్సన్‌ 866 పాయింట్లతో నెం.1 టెస్టు బౌలర్‌గా ఉంటే రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం జేమ్స్‌ అండర్సన్‌కి, రవిచంద్రన్‌ అశ్విన్‌కి కేవలం 2 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఇండోర్‌లో జరిగే టెస్టులో అశ్విన్‌ అదరగొడితే, నెం.1 టెస్టు బౌలర్‌గా నిలవచ్చు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో సత్తా చాటుతున్న టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 6 స్థానాలు ఎగబాకి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. 763 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.

aswin, jadeja
  • ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే

1. జేమ్స్‌ ఆండర్సన్‌- ఇంగ్లండ్‌- 866 పాయింట్లు
2. రవిచంద్రన్‌ అశ్విన్‌- ఇండియా- 864 పాయింట్లు
3. ప్యాట్‌ కమిన్స్‌- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు
4. ఓలీ రాబిన్సన్‌- ఇంగ్లండ్‌- 820 పాయింట్లు
5. జస్‌ప్రీత్‌ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు