హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీలో సీఎం జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని నందమూరి సుహాసిని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ మధురానగర్‌లో 'ఐయామ్ విత్ సీబీఎన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుహసిని పాల్గని మాట్లాడారు. ''చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడు. ఆయన అరెస్టు చాలా దారుణం. ఇలాంటి అరెస్టులతో టిడిపిను ఆపలేరు.. ఇంకా బలోపేతం అవుతాం. చంద్రబాబు తప్పక విడుదలై మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవుతారు'' అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.










