విశాఖపట్నం: కోడి కత్తి కేసుపై విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీమ్ తన వాదనలు వినిపించారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
అనంతరం న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడారు. ''శ్రీనివాస్ బెయిల్‌పై రేపు వాదనలు జరుగుతాయి. ఎయిర్‌పోర్ట్ ఘటన రోజు వైసిపి నేతలపై కేసు నమోదైంది. దీనిపై విచారణ ఎందుకు జరగడం లేదు. ఈ కేసులో సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలి'' అని సలీం అన్నారు.










