8-9 శాతం వృద్థి సాధించడం కష్టమే
డెలాయిట్ దక్షిణాసియా సిఇఒ అంచనా
న్యూఢిల్లీ : భారత్ అభివృద్థి చెందిన దేశంగా మారాలంటే ప్రతీ ఏడాది సగటున 8ా9 శాతం వృద్థి రేటును సాధించాల్సి ఉంటుందని డెలాయిట్ దక్షిణ ఆసియా సిఇఒ రోమల్ శెట్టి అన్నారు. ఇందుకోసం స్థిర వృద్థి రేటు అవసరమన్నారు. రానున్న 20 ఏళ్ల పాటు ప్రతీ ఏడాది కూడా 8 నుంచి 9 శాతం వరకు జిడిపి పెరుగుదల ఉంటేనే అభివృద్థి చెందిన దేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. 2047 కల్లా భారత్‌ను అభివృద్థి చెందిన దేశంగా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే పేర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభమైన విషయం కాదని రోమల్ పేర్కొన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ప్రతి సంవత్సరం 8-9 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయన్నారు.
అంతరిక్ష రంగంలో భారత్‌లో ఇప్పటికే 200 స్టార్టప్ సంస్థలు ఉన్నాయని అన్నారు. 2040 కల్లా ఇవి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అంచనా వేశారు. వ్యవసాయం, అంతరిక్షం, సెమీకండక్టర్, విద్యుత్ వాహనాల రంగంలో ఉన్న అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం కూడా 16 వేల నుంచి 18 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివఅద్ధి, వాణిజ్యానికి ఇది మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు. ముడి చమురు దిగుమతులు భారత్‌కు అతిపెద్ద సవాల్‌గా ఉందన్నారు. ఆధునిక సాంకేతికత దేశ స్వరూపాన్ని మార్చినప్పటికీ దీనిని అందరికీ సమానంగా చేరువ చేయడంలో మాత్రం ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. 2022ా23లో భారత జిడిపి 7.2 శాతానికి పరమితమయిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ జిడిపి గణంకాలపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపుతోందనే విమర్శలు నెలకొన్నాయి.










