విండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో సిరీస్ ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధం కానుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం రాత్రి షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు ఐసీసీ ట్వీట్ చేసింది. ఐర్లాండ్‌తో మూడు టీ20లను భారత్ ఆడనుంది. ఆగస్ట్ 18 నుంచి 23వ తేదీ మధ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి. మలాహిడే వేదికగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని షెడ్యూల్‌లో ఐసీసీ పేర్కొంది.
షెడ్యూల్ ఇలా..
ఆగస్ట్ 18: తొలి టీ20 మ్యాచ్
ఆగస్ట్ 20: రెండో టీ20 మ్యాచ్
ఆగస్ట్ 23: మూడో టీ20 మ్యాచ్
ఐర్లాండ్ క్రికెట్ సీఈవో వారెన్ డియోట్రమ్ స్పందిస్తూ.. ''ఏడాదిలోపే రెండోసారి ఐర్లాండ్ పర్యటనకు వచ్చే భారత్ ఆటగాళ్లకు స్వాగతం చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నాం. గతేడాది రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వీక్షించాం. ఈసారి మాత్రం మూడు టీ20ల సిరీస్ సిద్ధం చేశాం. అభిమానులు సంతోషించేలా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా బీసీసీఐకి ధన్యవాదాలు చెబుతున్నాం. బిజీ షెడ్యూల్‌లోనూ మా దేశ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయం'' అనితెలిపారు.










