Oct 15,2023 12:22

తెలంగాణ : మంత్రి కెటిఆర్‌కు బోస్టన్‌లోని హార్వర్డ్‌ యూనివర్శిటీ ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్‌ 21వ సదస్సులో మాట్లాడేందుకు రావాలని పిలుపునిచ్చింది. 'ఇండియా రైజింగ్‌-బిజినెస్‌, ఎకానమీ, కల్చర్‌' అనే థీమ్‌పై ఫైర్‌చాట్‌లో కెటిఆర్‌ ప్రసంగించనున్నారు. హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్‌ అనేది అమెరికాలోని విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. ఇందులో వెయ్యిమంది విద్యార్థులు, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందడంపట్ల మంత్రి కెటిఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.