Oct 06,2023 21:42

- విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు
- పోస్టర్‌ ఆవిష్కరణలో నిర్వాహకులు
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ (విజయవాడ):యువతలో లింగ సమానతపై చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 12, 13 తేదీల్లో అంతర కళాశాలల సాంస్కృతికోత్సవాలు నిర్వహించనున్నట్లు సేఫ్‌ అధ్యక్షులు జి జ్యోత్స్న, కెవిఎస్‌ఆర్‌ సిద్దార్థ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ సునీత తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డు సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఈ ఉత్సవాల పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోత్న్స మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌, నర్సింగ్‌, ఫార్మసీ తదితర అన్ని కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గనేందుకు అర్హులని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్లో కొంత మంది పేర్లను నమోదు చేసుకున్నారని, రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 10వ తేదీ వరకూ సమయం పొడిగించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోస్టర్‌ ఆవిష్కరణలో నగర ప్రముఖులు డాక్టర్‌ ఎన్‌ విద్యాకన్నా, నిర్వహణా కమిటీ సభ్యులు డాక్టర్‌ కెవిఎన్‌ చంచులక్ష్మీ, డాక్టర్‌ ఎస్‌కె రెహన, ఎవిఎస్‌ రవి, సాయినాథ్‌, టి శారద మృణాళిని, సేఫ్‌ కార్యదర్శి జి వాణి, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు పాల్గొన్నారు.