- బడ్జెట్‌పై ఐసిఐసిఐ లాంబర్డ్ జిఐసి ఎండి వినతి
హైదరాబాద్ : ప్రజల జీవితాల్లో బీమా అనేది ఎంతో ముఖ్యమైందని ఐసిఐసిఐ లాంబర్డ్ జిఐసి లిమిటెడ్ ఎండి, సిఇఒ భార్గవ్ దాస్ గుప్తా పేర్కొన్నారు. బీమా అనేది ఆవశ్యకమైన అంశంగా నిలుస్తోందని.. అవసర కాలంలో ఆదుకునే ఈ రంగానికి ఆర్థిక వెసులుబాటుని కల్పించడమే కాక, పన్ను ప్రయోజనాలు అందించాలని ఆయన కోరారు. దీంతో మరింత మంది ప్రజలు వారి కుటుంబాలకు రక్షణ కల్పించేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. ఈ రంగానికి పన్నుల విధానంలో బడ్జెట్‌లో మరింత ప్రయోజనాలు అందించాలని కోరుకుంటున్నామన్నారు. అలా చేయడం ద్వారా ప్రజలు స్వయంగా వారికి, వారి కుటుంబాలకి బీమా కల్పించడానికి ఇది అదనపు ప్రేరణగా నిలుస్తుందన్నారు. దీర్ఘకాలంలో ఇది పాలసీదారులకు మెరుగైన అవకాశాలు కల్పించి, పరిశ్రమ ప్రజల్ని లోతుగా చేరుకోడానికి దోహదం చేస్తుందన్నారు.










