అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సంబంధించి తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ... మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మంగళవారం నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అరెస్టు చేయవద్దన్న గత ఉత్తర్వులను మరో రెండు వారాలకు పొడిగించింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈనెల 4న లోకేశ్‌తో పాటు మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సిఐడి సోమవారం మరోసారి నారాయణకు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా గుంటూరులో విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఇంటి వద్దే విచారించేలా సిఐడిని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.










