Oct 09,2023 14:48

ప్రజాశక్తి-అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు సోమవారంకోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో మరో నలుగురి పేర్లను చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి,ఆవుల మణిశంకర్‌, సాంబశివరావు, ప్రమీల పేరును చేర్చారు. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌ మెంట్‌లో తమకు చెందిన వారికి లబ్ది చెందేలా మార్పులు చేశారని చంద్రబాబు, నారాయణలపై ఏపీ సీఐడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నలుగురి పేర్లను సీఐడీ చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.