Feb 10,2023 22:07

కేప్‌టౌన్‌: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు గటి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన గాయపడింది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా స్మృతి ఎడమచేతి మధ్యవేలికి గాయమైనట్లు సమాచారం. దీంతో ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ప్రాక్టీస్‌ దూరంగా ఉంది. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. అదే నిజమైతే ఆమె పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరమైనట్లే. గ్రూప్‌-బిలో భారతజట్టుతోపాటు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ జట్లు ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభమైంది.