May 19,2023 22:15

జూనియర్స్‌లో పసిడి, యూత్‌లో సిల్వర్‌ కైవసం
హైదరాబాద్‌ : ఐహెచ్‌ఎఫ్‌ చాలెంజర్‌ ట్రోఫీలో భారత్‌ సత్తా చాటింది. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య నిర్వహించిన ప్రతిష్టాత్మక టోర్నీలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. జూనియర్‌ విభాగంలో చాంపియన్‌గా, యూత్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఈ నెల 13-18న ఢాకాలో జరిగిన టోర్నీలో భారత్‌ సహా నాలుగు దేశాలు పోటీపడ్డాయి. జూనియర్‌ విభాగం ఫైనల్లో 48-17తో బంగ్లాదేశ్‌పై భారత్‌ గెలుపొందగా.. యూత్‌ విభాగంలో 43-46తో బంగ్లాదేశ్‌కు భారత్‌ పసిడి కోల్పోయింది. చాలెంజర్‌ ట్రోఫీలో పతకాలు సాధించిన భారత మహిళల జట్లకు జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు అభినందనలు తెలిపారు.