Feb 28,2023 21:51

దుబాయ్ : వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్స్‌లో భారత మహిళల జట్టు చోటు దక్కించుకుంది. మొత్తం ఆరు జట్లు క్వాలిఫై అయినట్టు ఐసీసీ ప్రకటించింది. గ్రూప్‌-1, గ్రూప్‌ -2లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించాయి. గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌.. గ్రూప్‌-2 నుంచి భారత్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ క్వాలిఫై అయ్యాయి. అయితే.. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ అర్హత సాధించలేదు. ఈ మెగా టోర్నీకి మొత్తం ఎనిమిది జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. దాంతో, ఐసీసీ త్వరలోనే ఆ రెండు జట్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

  • ఆతిథ్య బంగ్లాకు నిరాశే

2024 టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి బంగ్లాదేశ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అలాంటిది ఆ జట్టు టోర్నమెంట్‌కు క్వాలిఫై కాకపోవడంతో ఆ దేశ అభిమానులు నిరాశ చెందారు. అంతేకాదు శ్రీలంక, ఐర్లాండ్‌ జట్లు మాత్రమే 2023 వరల్డ్‌ కప్‌కి క్వాలిఫై కాలేదు. ప్రస్తుతం టీ 20 ర్యాంకింగ్స్‌లో ఈ రెండు జట్లు వరసగా ఎనిమిది, పది స్థానాల్లో ఉన్నాయి.