డొమినికా వేదికగా జూలై 12 నుంచి భారత్-విండీస్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు ముందు బార్బడోస్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు బ్యాచ్‌లగా కరీబియన్ దీవులకు చేరుకుంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ వంటి స్టార్ ఆటగాళ్లు విండీస్ గడ్డపై అడుగుపెట్టారు. ఇక విండీస్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు కరీబియన్ దీవుల్లో ఎంజారు చేస్తున్నారు. ఈ క్రమంలో బీచ్ వాలీబాల్ సెషన్‌లో టీమిండియా ప్లేయర్స్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.










