Apr 22,2023 16:07

అంటాల్యా : ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-1 టోర్నీలో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ- మహారాష్ట్ర ప్లేయర్‌ ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలె జోడీ భారత్‌కు స్వర్ణం అందించారు. తుర్కియేలోని అంటాల్యా వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో భారత జోడీ- చైనీస్‌ తైపీ ద్వయంతో తలపడింది. ఈ క్రమంలో 159- 154తో ప్రత్యర్థిపై గెలుపొంది. కాగా జ్యోతి సురేఖకు మెగా ఈవెంట్‌లో ఇది రెండో స్వర్ణ పతకం. పారిస్‌లో 2022లో జరిగిన వరల్డ్‌కప్‌-3లో జ్యోతి సురేఖ- అభిషేక్‌ వర్మతో కలిసి విజేతగా నిలిచారు.