Mar 09,2023 10:53

లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆసీస్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ఆస్ల్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా హాఫ్‌ సెంచరీ చేశాడు. 146 బంతులు ఆడిన ఖవాజా 50 పరుగులు మార్కును అందుకున్నాడు. ఖవాజా ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. మరో వైపు స్మిత్‌ పట్టుదలగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 86 బంతుల్లో 26 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆసీస్‌ 128 పరుగులు చేసింది.

  • మొదటి రోజు లంచ్‌ బ్రేక్‌.. 75/2

ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలైన చివరి టెస్టులో మ్యాచ్‌లో లంచ్‌బ్రేక్‌ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (32), ఉస్మాన్‌ ఖవాజా మంచి ఆరంభం ఇచ్చారు. 16వ ఓవర్లో జడేజా క్యాచ్‌ ద్వారా ట్రావిస్‌ హెడ్‌ను ఔట్‌ చేసిన అశ్విన్‌ ఈ జోడీని విడదీసి భారత్‌ కు తొలి బ్రేక్‌ అందించాడు. అనంతరం 23వ ఓవర్లో మమ్మద్‌ షమీ.. మార్నస్‌ లబుషేన్‌ (3)ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌ డీలా పడింది. ప్రస్తుతం ఆసీస్‌ 75/2 స్కోరుతో ఆడుతుండగా.. ఉస్మాన్‌ ఖవాజా (27)కు తోడు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (2) క్రీజులో ఉన్నాడు.

  • లబూషేన్‌ (3) ఔట్‌.. ఆసీస్‌ 73/2

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. మార్నస్‌ షమీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 20 బంతులను ఎదుర్కొన్న మార్నస్‌ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 73/2గా ఉంది. ఖవాజా 26 పరుగులతో ఉన్నాడు. క్రీజులోకి స్మిత్‌ వచ్చాడు.

 

  • తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. హెడ్‌ ఔట్‌

16వ ఓవర్‌ మూడో బంతికి ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి ట్రవిస్‌ హెడ్‌ (32) ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 62/1. ఉస్మాన్‌ ఖ్వాజా (18), లబూషేన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

  • 10 ఓవర్లు పూర్తి .. ఆస్ట్రేలియా 30/0


10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 30 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా భారత బౌలర్లను దాటిగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి ట్రావిస్‌ హెడ్‌ (11), ఉస్మాన్‌ ఖవాజా (8)హొ పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. కాగా తొలి వికెట్‌ తీయడానికి షమీ, ఉమేష్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... తొలుత బ్యాటింగ్‌

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సారథి స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.. తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా, మూడో టెస్టులో గెలిచి సిరీస్‌లో 2-1 తేడాతో కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. ఇండోర్‌ టెస్టు ఓడిన భారత జట్టు, సిరీస్‌ని సొంతం చేసుకోవాలన్నా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి నేరుగా అర్హత సాధించాలన్నా ఆఖరి టెస్టు గెలవడం లేదా కనీసం డ్రా చేసుకోవడం తప్పని సరి. మరో వైపు మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా, చివరి టెస్టును కూడా గెలిచి సిరీస్‌ని సమం చేయాలని చూస్తోంది..

భారత్‌ : రోహిత్‌ శర్మ(సి), శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, శ్రీకర్‌ భరత్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఉమేష్‌ యాదవ్‌
ఆస్ట్రేలియా : ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లాబుస్‌చాగే, స్టీవెన్‌ స్మిత్‌(సి), పీటర్‌ హ్యాండ్‌స్కాంబ్‌, కామెరాన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కారీ, మిచెల్‌ స్టార్క్‌, టాడ్‌ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్‌, నాథన్‌ లియాన్‌