అంటల్యా(టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ పురుషుల రికర్వు విభాగంలో భారతజట్టు పోరాటం ముగిసింది. ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, నీరజ్ చౌహాన్‌లతో కూడిన భారతజట్టు గ్రూప్-1 క్వార్టర్‌ఫైనల్లో 0-6(54-55, 56-57, 54-59)తేడాతో టాప్ సీడ్ కొరియా చేతిలో చిత్తుగా ఓడింది. 8వ సీడ్‌గా బరిలోకి దిగిన భారత రికర్వు జట్టు తొలి మ్యాచ్‌లో 5-3(57-57, 56-58, 57-56, 58-51)తేడాతో చైనీస్ తైపీపై గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఇక 4వ సీడ్‌గా బరిలోకి దిగిన మహిళల తొలిరౌండ్‌లోని పరాజయాన్ని చవిచూసింది. సిమ్రన్‌జీత్ కౌర్, అన్వీత్ కౌర్, అంకిత భగత్‌లతో కూడిన మహిళల జట్టు క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఇండోనేషియా చేతిలో 1-5(54-57, 57-57, 50-52)తో పోరాడి ఓడింది. రికర్వులో భారత్ పోరాటం ముగియడంతో మిక్స్‌డ్ డబుల్స్‌లో ధీరజ్ బొమ్మదేవర-సిమ్రన్‌జీత్ కౌర్ బరిలో ఉండగా.. 5వ స్థానంలో నిలిచి వీరు ప్రి క్వార్టర్స్‌లో డ్రా చేసుకొన్నారు.










