Oct 16,2023 09:18
  • రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌
  • అసైన్డ్‌ భూములపై ఆంక్షలు తొలగింపు
  • బిపిఎల్‌ కుటుంబాలన్నింటికీ జీవిత బీమా
  • రూ.15 లక్షల వరకు ఉచితంగా వైద్యం
  • మహిళలకు రూ.3 వేల భృతి
  • బిఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రకటించిన కెసిఆర్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ పలు ప్రజాకర్షక హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తమ పార్టీ అభ్యర్థులు 51 మందికి బిఆర్‌ఎస్‌ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ బి-ఫారాలను అందజేశారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టోను మీడియాకు ఆయన వెల్లడించారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలనూ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆదాయ, వ్యయాలను అంచనా వేసిన తర్వాతే హామీలపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో హామీల అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

11