Oct 08,2023 08:09

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రయోజనాల కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు తలొగ్గితే రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందనిఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈమేరకు శనివారం రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డిలు విడుదల చేసిన ప్రకటనలో సాగునీటి హక్కులకై రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టిగా నిలబడాలని కోరారు. రైపేరియన రైట్స్‌ ప్రకారం నికర జలాల్లో దిగువ రాష్ట్రమైన మన రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు, రాయలసీమ ప్రాజెక్టులకు అవసరమైన నీటిని సాధించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అదే విధంగా తరుగు ఉన్న సంవత్సరాల్లో దామాషా పద్దతిలో నీటి విడుదలకు ఏర్పాటు చేసుకోవాల్సిఉందని సూచించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి. అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.