May 21,2023 15:19

ముంబయి : ఐపీఎల్‌-23 లీగ్‌ దశ నేటితో ముగియనుంది. ఆఖరి రోజు జరిగే డబుల్‌ హెడర్స్‌లో భాగంగా ... తొలి మ్యాచ్‌లో ముంబయి, హైదరాబాద్‌ బరిలోకి దిగనున్నాయి. కొద్దిసేపట్లో ... వాంఖడే స్టేడియం వేదికగా ఆట ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నారు. ఆటోలో గెలిచేందుకు ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు ముంబయి సిద్ధమవ్వగా, మరోవైపు సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో విజయవంతంగా టోర్నీని ముగించాలని చూస్తోంది. బరిలో ఏ జట్లు విజయకేతనాన్ని అందుకుంటుందో వేచిచూడాలి.