శ్రీకాకుళం : జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో కుటుంబ కలహలతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలంలోని జగన్నాథపురంలో దాసరి సింహద్రి తన భార్య ఉమను హత్యచేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










