ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) :నందిగామ నగర పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నందిగామలో నిర్వహించారు. 500 మీటర్ల జాతీయ జెండాతో నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మువ్వన్నెల జెండాలను పంపిణీ చేశారు. భారతదేశ స్వాతంత్రం - భారత జాతి సమైక్యతకు స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కలిసి జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారని, విద్యార్థులందరూ చిన్నతనం నుంచే దేశభక్తి, జాతీయభావం అలవర్చుకోవాలని, సమాజ సేవ చేస్తే దేశానికి సేవచేసినట్లేనని, ఆజాదీ కా అమత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ఎస్.జయరాం, ఎసిపి జి.నాగేశ్వరరెడ్డి , సి ఐ కనక రావు -ఎస్ ఐ లు సురేష్,పండుదొర , ఎమ్మార్వో నరసింహారావు , ఏఈ ఫణి శ్రీనివాసరావు , పలు పాఠశాలల విద్యార్థులు -ఉపాధ్యాయులు , నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.











