Oct 15,2023 08:15

చంద్రబాబు ఆరోగ్యంపై సిపిఎం రాష్ట్రకమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై నిపుణులైన వైద్య బృందాన్ని నియమించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని గవర్నర్‌పేటలో జరిగిన సిపిఎం విజయవాడ ప్రజా పోరుబాట ముగింపు సభ సందర్భంగా విలేకరులతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన మాట్లాడారు. అధికారులు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైతే ఆస్పత్రికి తరలించి తక్షణం వైద్య సహాయం అందించాలని కోరారు.