విజయవాడ : టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 19 కి ఎసిబి కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 19వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుకు సంబంధించి... చంద్రబాబుకు బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ, ఆయన తరపున విజయవాడ ఎసిబి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని సిఐడి తరపు న్యాయవాది కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విచారణకు వస్తారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను రానున్న మంగళవారానికి వాయిదా వేసింది.










