Oct 09,2023 12:54

న్యూఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ... టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ ప్రారంభమైంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. ఎపి ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిస్తున్నారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. దీంతో ఈరోజు మళ్లీ వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాదోపవాదాలు సాగుతున్నాయి.