Sep 13,2023 15:15

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.వివరాల్లోకి వెళ్తే.. సిర్పూర్‌(యూ) మండలానికి చెందిన కుద్మెట జల్‌పథ్‌ రావు(53) 1990లో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరారు. కానిస్టేబుల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, హెడ్‌ కానిస్టేబుల్‌ దాకా ఎదిగారు. అయితే మంగళవారం రాత్రి తనకు ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపాడు. దీంతో అతన్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు వల్లే కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
హెడ్‌ కానిస్టేబుల్‌ మఅతిపట్ల ఎస్‌పీ కే సురేశ్‌ కుమార్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు సురేశ్‌, రాణా ప్రతాప్‌ సంతాపం ప్రకటించారు. రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కానిస్టేబుల్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్‌పీ తెలిపారు. రావు తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించేవారని స్పష్టం చేశారు.