ముంబయి: మహిళల ప్రిమియర్‌లీగ్(డబ్ల్యుపిఎల్) ముంబయి ఇండియన్స్ కెప్టెన్ కెప్టెన్‌గా భారతజట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నియమించబడింది. ఈ విషయాన్ని ఆ ఆ ఫ్రాంచైజీ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. 'హర్మన్ ప్రీత్ కెప్టెన్‌గా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది' అని జట్టు యజమానికి నీతా అంబానీ బుధవారం మీడియాకు తెలిపారు. హర్మన్ ప్రీత్ కౌర్‌ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.1.80కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హర్మన్ ఇటీవల 150టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ముంబయిలోని డివై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లో ఆరంభ డబ్ల్యుపిఎల్ లీగ్ జరగనుంది.
జట్టు: హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యస్టికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లా వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, ధారా గుజ్జార్, సైకా ఇష్క్, హీలీ మాథ్యూస్, ఛో ట్రియాన్, హుమైరా ఖాజి, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలమ్ బిస్ట్, జి. కలిత.










